Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రహస్య కెమెరాతో మహిళల నగ్న చిత్రాలు.. అమెరికాలో భారతీయ వైద్యుడి అరాచకం.. వేలల్లో వీడియోలు!

Indian doctor arrested in US for taking photos and videos of naked children and woman
  • 2011లో అమెరికా వెళ్లిన నిందితుడు ఒయిమెయిర్ ఎజాజ్ 
  • పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌గా విధులు
  • పనిచేసే చోట, బాత్రూంలు, గదుల్లో రహస్య కెమెరాలు
  • ఒక్క హార్డ్ డిస్క్‌లోనే 13 వేల ఫొటోలు.. అలాంటివి 15 గుర్తింపు
  • భార్య ఫిర్యాదుతో అరాచకం వెలుగులోకి 
అమెరికాలో ఓ భారతీయ వైద్యుడు అత్యంత నీచమైన పనికి పాల్పడ్డాడు. పనిచేస్తున్న ఆసుపత్రుల్లో రహస్యంగా కెమెరాలు అమర్చి చిన్నారులు, మహిళల నగ్న చిత్రాలు, వీడియోలను రికార్డు చేశాడు. కొన్నేళ్లపాటుగా సాగుతున్న ఈ వ్యవహారం అతడి భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. రికార్డు చేసిన వీడియోలను అతడు తన ఇంట్లోని కంప్యూటర్, ఫోన్లతోపాటు 15 ఎక్స్‌టర్నల్ స్టోరేజీ డివైజ్‌లలో భద్రపరిచాడు. ఒక సింగిల్ హార్డ్ డ్రైవ్‌లోనే ఏకంగా 13 వేల వీడియోలు ఉండడం చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. క్లౌడ్ స్టోరేజీలోనూ వీడియోలను అప్‌లోడ్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నాడు.

వర్క్ వీసాపై 2011లో భారత్ నుంచి అమెరికా వెళ్లిన ఒయిమెయిర్ ఎజాజ్ కొన్నేళ్లపాటు అలబామాలో ఉన్నాడు. 2018లో మిషిగాన్‌కు మారాడు. అక్కడ పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడు. పనిచేసే ప్రతి ఆసుపత్రిలోనూ గదులు, బాత్రూములు తదితర ప్రాంతాల్లో రహస్యంగా  కెమెరాలు అమర్చి మహిళల నగ్న వీడియోలు చిత్రీకరించేవాడు. అంతేకాదు, మహిళా రోగులు స్పృహలో లేనప్పుడు వారితో అసభ్యంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను కూడా రికార్డు చేసేవాడు. ఇటీవల అతడి భార్యకు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విస్తుపోయే ఈ దారుణాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇంటిని సోదా చేస్తే వేలాది వీడియోలు బయటపడ్డాయి. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Indian Doctor
America
Women
Children
Oumair Aejaz

More Telugu News